logo

రోడ్ల విస్తరణకు సహకరించిన వారికి సన్మానం

కడప అంబేడ్కర్‌ కూడలి నుంచి వైజంక్షన్‌ వరకు ప్రధాన రహదారిని 80 అడుగులకు విస్తరించడానికి నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Published : 05 Feb 2023 02:22 IST

భవన యజమానులను సన్మానిస్తున్న ఉపముఖ్య మంత్రి అంజాద్‌బాషా,

మేయర్‌ సురేష్‌బాబు, కమిషనర్‌  సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ తదితరులు

కడప నగరపాలక, న్యూస్‌టుడే : కడప అంబేడ్కర్‌ కూడలి నుంచి వైజంక్షన్‌ వరకు ప్రధాన రహదారిని 80 అడుగులకు విస్తరించడానికి నగరపాలక సంస్థ సన్నాహాలు చేస్తోంది. రోడ్ల విస్తరణ పనుల ఆవశ్యకత, దాని వల్ల యజమానులకు కలిగే ప్రయోజనాలు, టీడీఆర్‌ బాండ్ల వల్ల కలిగే ఉపయోగాలపై ప్రణాళిక విభాగం అధికారులు భవన యజమానులకు అవగాహన కల్పిస్తూ వచ్చారు. నష్టపరిహారంలో 50 నుంచి 75 శాతం వరకు టీడీఆర్‌ బాండ్ల రూపంలో తీసుకోవడానికి పలువురు యజమానులు అంగీకరించారు. వారిని కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆధ్వర్యంలో నగరపాలక కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారుల విస్తరణకు సహకరించి టీడీఆర్‌ బాండ్లు తీసుకున్న వారిని నగరం గుర్తుంచుకుంటుందన్నారు. సమావేశంలో ఉప మేయర్లు బండి నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని