logo

కలికికోడి ఆచూకీ గుర్తించండి : డీఎఫ్‌వో

ప్రపంచంలో అరుదైన కలివికోడి ఆచూకీ కోసం జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు.

Published : 06 Feb 2023 02:27 IST

అటవీ ప్రాంతంలో తాగునీటి వసతిని  పరిశీలిస్తున్న డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి

సిద్దవటం, న్యూస్‌టుడే: ప్రపంచంలో అరుదైన కలివికోడి ఆచూకీ కోసం జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా అటవీశాఖ అధికారి సందీప్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం రేంజి కొండూరు బీట్‌లోని కలివికోడి ఆవాసాలు, మచ్చాయకుంట, పరిశోధన కేంద్రం, తెలుగుగంగ కాలువను ఆదివారం డీఎఫ్‌వో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటవీ సిబ్బంది విధి నిర్వహణలో కలివికోడి ఆవాస ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. దాని ఆచూకీని జాగ్రత్తగా గమనించాలని సూచించారు. త్వరలో నూతన సాంకేతిక డిజిటల్‌ కెమెరాలు ఆవాస ప్రాంతాల్లో అమర్చుతామన్నారు. అంతకు ముందు నిత్యపూజస్వామికోనను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అటవీ క్షేత్రాధికారి ప్రసాద్‌, ఉప అటవీక్షేత్రాధికారి ఓబులేసు, బీటు అధికారి రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని