logo

నాణ్యమైన భోజనం పొందడం విద్యార్థుల హక్కు

నాణ్యమైన భోజనం పొందడం విద్యార్థుల హక్కు అని రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు

Published : 07 Feb 2023 05:34 IST

రాష్ట్ర  ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ విజయ ప్రతాప్‌రెడ్డి

విద్యార్థినులతో కలిసి అల్పాహారం తింటున్న రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి

పెనగలూరు, రైల్వేకోడూరు గ్రామీణ, పుల్లంపేట, రాజంపేట, న్యూస్‌టుడే: నాణ్యమైన భోజనం పొందడం విద్యార్థుల హక్కు అని రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ విజయప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. పెనగలూరు ఆదర్శ పాఠశాల వసతిగృహం విద్యార్థినులతో మాట్లాడి వారితో కలిసి అల్పాహారం తిన్నారు. మెనూ ప్రకారం వంటలు చేయడం లేదని, గడువు ముగిసిన చిక్కీలు, రాగిజావ ఇస్తున్నారని ఫిర్యాదులందాయని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. అనంతరం పెనగలూరులోని చౌక ధరల దుకాణం, ఎస్సీ బాలురు వసతిగృహం తనిఖీ చేశారు. రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి, శెట్టిగుంట చౌక ధరల దుకాణాలను .పరిశీలించిన ఆయన ఆయా దుకాణాల్లో సరకుల నిల్వల్లో తేడాలుండడంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లక్ష్మీ గారిపల్లె ప్రాథమిక, అనంతరాజుపేట గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. రైల్వేకోడూరులోని బియ్యం గోదాంలను పరిశీలించి నిల్వల వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం పుల్లంపేట మండలం శ్రీరాములపేటలోని సమీకృత బాలుర వసతి గృహం, రాజంపేట బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలోని బీసీ బాలికల ఇంటిగ్రేడెడ్‌ వసతి గృహాన్ని పరిశీలించారు. ఆయనవెంట జిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షుడు పంజం సుకుమార్‌రెడ్డి, డీఎస్వో రఘురాం, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి షమీంబాషా, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రవీంద్రరెడ్డి, పలువురు అధికారులు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని