logo

గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్‌

జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు

Published : 07 Feb 2023 05:34 IST

సమీక్షీస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, పక్కన జేసీ సాయికాంత్‌వర్మ, అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలు సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవనంలో జగనన్న కాలనీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులు జేసీ సాయికాంత్‌వర్మతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, వాటన్నింటిని సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటూ అందుకుతగ్గట్టుగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి వారం ఆయాశాఖల పనితీరుపై మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రగతి నివేదికలు అందించాలన్నారు. వీటితో పాటు ప్రాధాన్యతా రంగాల నిర్మాణాల్లోనూ పురోగతి కన్పించాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలపై సమీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌,  హౌసింగ్‌ పీడీ కృష్ణయ్య, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా, ఆర్డీవోలు వెంకటరమణ, శ్రీనివాసులు, వెంకటేశు పాల్గొన్నారు. ః ప్రజల వినతులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సభాభవనంలో జేసీ సాయికాంత్‌వర్మ, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, ఎస్డీసీలు రామ్మోహన్‌, చంద్రమౌలి, నరసింహులు, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ఆయా శాఖలకు బదలాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని