logo

జూన్‌ నుంచి యోవేవిలో దూరవిద్య కోర్సులు

యోగి వేమన విశ్వవిద్యాలయంలో దూర విద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్దన్‌ వెల్లడించారు.

Published : 07 Feb 2023 05:34 IST

ఉపకులపతి రంగ జనార్దన్‌

మాట్లాడుతున్న ఉపకులపతి రంగ జనార్దన్‌, పక్కన రిజిస్ట్రార్‌ వెంకటసుబ్బయ్య, డీడీఈ డైరెక్టర్‌ షావలిఖాన్‌

వైవీయూ (కడప), న్యూస్‌టుడే : యోగి వేమన విశ్వవిద్యాలయంలో దూర విద్య కోర్సులు ప్రారంభిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్దన్‌ వెల్లడించారు. డీడీఈ డైరెక్టర్‌ పి.ఎస్‌.షావలిఖాన్‌ అధ్యక్షతన కులసచివులు వెంకటసుబ్బయ్య, ప్రధానాచార్యులు కృష్ణారెడ్డితో కలిసి దూరవిద్యపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపకులపతి మాట్లాడారు. మూడు విడతల్లో 22 కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ నుంచి తొలివిడతగా ఏడు డిగ్రీ, ఏడు పీజీ, రెండు డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సుల గురించి డీన్లతో సమీక్షించారు. కొత్త కోర్సులకు సంబంధించి సిలబస్‌, విధివిధానాలపై బోర్డ్‌ ఆఫ్‌ ఛైర్మన్‌లతో చర్చించారు. అధ్యయన కేంద్రాలను గుర్తించాలని, నాణ్యమైన అభ్యసన సామగ్రిని రూపొందించాలని సూచించారు. డీడీఈ సంచాలకులు షావలిఖాన్‌ మాట్లాడుతూ.. జూన్‌ లోపు కోర్సులకు సంబంధించి యూజీసీ నుంచి అనుమతి పొందుతామన్నారు. కులసచివులు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ వివిధ కారణాలతో సహిత విద్యను అందుకోలేని వారికి ఇది అద్భుత అవకాశమన్నారు. కార్యక్రమంలో డీడీఈ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీధర్‌బాబు, డీన్లు, బీవోఎస్‌ ఛైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని