logo

నాడు-నేడుకు నిధుల విడుదల

జిల్లాలో మనబడి నాడు-నేడు రెండో దశలో చేపట్టిన పనులకు మలివిడత రివాల్వింగ్‌ పద్దు రూ.10.73 కోట్లు తాజాగా విడుదల చేశారు.

Published : 20 Mar 2023 04:49 IST

కొండమాచుపల్లె ప్రాథమిక పాఠశాలలో ఆగిన నిర్మాణాలు

కడప, న్యూస్‌టుడే : జిల్లాలో మనబడి నాడు-నేడు రెండో దశలో చేపట్టిన పనులకు మలివిడత రివాల్వింగ్‌ పద్దు రూ.10.73 కోట్లు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు ఆయా కమిటీల సంయుక్త ఖాతాలకు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొన్ని విద్యాలయాలకు జమ చేశారు. మరికొన్నింటికి ఇంకా పద్దు రావాల్సి ఉంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో ‘మనబడి నాడు-నేడు’ రెండో దశలో 1,006 ప్రభుత్వ పాఠశాలలో 1,438 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వీటి అంచనా విలువ రూ.288.08 కోట్లు. సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్‌, గ్రామీణ తాగునీటి సరఫరా పీహెచ్‌ఈడీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ పర్యవేక్షణలో పనులు చేపడుతున్నారు. తొలివిడతలో రివాల్వింగ్‌ ఫండ్‌ రూ.56.06 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే ఎంపికైన బడుల ఖాతాలకు రూ.54.98 కోట్లు చేరింది. ఈ మేరకు పనులు చేపట్టారు. వచ్చిన పద్దు ఖాళీ అయింది. నిధుల్లేక నాలుగు నెలలుగా పనులు చేయలేదు. సమస్యపై ‘నిధులు లేవు... బిల్లులు కావు’ శీర్షికన ఈనెల 10న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించారు. 375 పాఠశాలలకు రూ.909.21 లక్షలు, 53 అంగన్‌వాడీలకు రూ.82.95 లక్షలు, తొమ్మిది జూనియర్‌ కళాశాలకు రూ.84.85 లక్షలు తాజాగా విడుదల చేశారు. ఇదే విషయాన్ని సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కి తెలిపారు. పనులను వేగవంతం చేయిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని