logo

వైకాపా నాయకుల వ్యాఖ్యలపై... తెలుగు తమ్ముళ్ల ఆందోళన

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా తంబళ్లపల్లె నియోజకవర్గ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని తెదేపా నాయకులు నిరసించారు.

Published : 21 Mar 2023 04:07 IST

తెదేపా నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

ములకలచెరువు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా తంబళ్లపల్లె నియోజకవర్గ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని తెదేపా నాయకులు నిరసించారు. ములకలచెరువులోని జాతీయ రహదారిపై సోమవారం వారంతా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ పార్టీ నాయకుడైనా రాజకీయాల గురించి మాట్లాడాలే తప్ప నాయకుల కుటుంబసభ్యుల గురించి ఇష్టారీతిన మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా వీరిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాలగిరి సిద్ధ, సుధాకర్‌నాయుడు, కట్టా హరి, మౌలా, కేవీ రమణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులను బైండోవర్‌ చేసినట్లు ఏఎస్‌ఐ నజీర్‌ తెలిపారు. వైకాపా నాయకులను రెచ్చగొట్టేవిధంగా నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ సాధిక్‌అలీ ఆదేశాల మేరకు 11 మంది తెదేపా నాయకులను బైండోవర్‌ చేసి తహసీల్దారు శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు.

జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని