logo

అంగన్‌వాడీల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్‌ ఎదుట సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు.

Published : 21 Mar 2023 04:07 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు

రాయచోటి, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్‌ ఎదుట సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కా,రానికి నిర్వహించతలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకుని సంఘం నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడాన్ని నిరసిస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండు చేశారు. కనీస వేతనం రూ.26 వేలివ్వాలని, జీవో 1 రద్దు చేయాలని, అయిదేళ్లుగా అందాల్సిన టీఏలు, ఇతర అలవెన్సులను వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. అనంతరం కలెక్టర్‌ గిరీషకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సిద్ధమ్మ, విజయమ్మ, నాగమణి, సుకుమారి, రమణమ్మ, ప్రభావతి, ఓబులమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని