logo

ఇనుప రేకులు పీకేయండి!

ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన పందిళ్ల ఇనుప రేకులను వెంటనే తొలగించాలని తితిదే ఉన్నతాధికారులు ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:07 IST

అన్నప్రసాదం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పందిరి ఇనుప రేకులను తొలగిస్తున్న కార్మికులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన పందిళ్ల ఇనుప రేకులను వెంటనే తొలగించాలని తితిదే ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేవిధంగా ప్రమాదరహిత (జర్మనీ షెడ్లు) పందిళ్లు వేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రకృతి ప్రకోపంతో 2018, మార్చి 30న, 2019, ఏప్రిల్‌ 20న ఇనుప రేకులు కూలిపోవడంతో అపార నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి ఇనుప రేకులతో వేయరాదని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తిరిగి పాత పంథా అనురిసరిస్తూ అన్నప్రసాదం వితరణ కేంద్రం, భక్త సంజీవరాయస్వామి ఆలయం లోపల, బయట, కల్యాణ వేదిక ప్రాంగణంలో ఇనుప రేకులతో పందిళ్లు వేశారు. రామయ్య క్షేత్రం మాడ వీధిలో ఈశాన్య దిశలో వేసి తిరిగి తొలగించారు. సమస్యపై ‘ఈనాడు’లో సోమవారం ‘వద్దన్నా అవే పనులు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తితిదే ఉన్నతాధికారులు స్పందించి ఇనుప రేకులను తొలగించాలని ఇంజినీర్లను ఆదేశించారు. దీంతో అన్నప్రసాదం కేంద్రం ముంగిట్లో వేసిన ఇనుప రేకులను తొలగించి జర్మనీ షెడ్లు వేసేందుకు పనులు చేపడుతున్నారు. విపత్తులొచ్చినా తట్టుకునేవిధంగా జర్మనీ షెడ్లు వేస్తున్నామని ఏఈ అమర్‌నాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు