logo

విద్యుత్తు ఉత్పత్తి... దీపాలు ఉత్తుత్తి!

రాయలసీమ ప్రాంత వెలుగుల దివ్వె.. ఎర్రగుంట్లలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) ప్రాంతంలో విద్యుత్తు దీపాల వెలుగులు లేక అంధకారం నెలకొంటోంది.

Published : 21 Mar 2023 04:07 IST

రాయలసీమ ప్రాంత వెలుగుల దివ్వె.. ఎర్రగుంట్లలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) ప్రాంతంలో విద్యుత్తు దీపాల వెలుగులు లేక అంధకారం నెలకొంటోంది. కేంద్రం ముంగిట ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు దెబ్బతిని దాదాపు ఏడాది కావస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, స్థానికులు నిత్యం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంధకారంతో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడమే కాకుండా ప్రాణనష్టం కూడా జరగడం గమనార్హం. ఈ విషయమై ఆర్టీపీపీ సీఈ మురళీకృష్ణ మాట్లాడుతూ పనిచేయని విద్యుత్తు దీపాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.

న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని