logo

సీఎంకు ఓటమి భయం పట్టుకుంది : తులసిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని పీసీసీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు.

Published : 21 Mar 2023 04:07 IST

మాట్లాడుతున్న తులసిరెడ్డి, పక్కన డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని పీసీసీ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోటీ చేస్తే తానెక్కడ ఓడిపోతాననే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూస్తే వైకాపా ప్రభుత్వంపై విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతమాత్రాన తమకు అనుకూలమని తెదేపా భావించడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేయని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఐటీ, ఈడీ, సీబీఐ తదితర రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. రాహుల్‌గాంధీకి నోటీసులు ఇవ్వడం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుమలేశ్‌, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్యామలాదేవి, జిల్లా ప్రధానకార్యదర్శి  ప్రసాద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని