logo

తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు: కలెక్టర్‌

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:07 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు, వడగాల్పుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కూలీలకు ఓఆర్‌ఎస్‌ పొట్లాలు పంపిణీ చేయాలని, ఆర్టీసీˆ బస్టాండ్లలో తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మండలాల్లో తాగునీటి సమస్యపై రెవెన్యూశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో సత్యనారాయణ, రాజంపేట సబ్‌కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవోలు రంగస్వామి, డీపీవో ధనలక్ష్మీ, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని