logo

న్యాయమైన పరిహారమివ్వాలని ధర్నా

గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి కోసం ఇస్తున్న భూములకు మార్కెట్‌ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కేతవరం, అల్లాడుపల్లె, లక్ష్మీపేట, భద్రిపల్లె రైతులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.

Published : 21 Mar 2023 04:07 IST

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బాధిత రైతులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి కోసం ఇస్తున్న భూములకు మార్కెట్‌ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కేతవరం, అల్లాడుపల్లె, లక్ష్మీపేట, భద్రిపల్లె రైతులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. రైతులు మహావీర్‌ కూడలి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ సాయికాంత్‌వర్మను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణాంలో తాము భూములు కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం రహదారి పక్కన భూములకు రూ.24 లక్షలు, లోపలివైపు భూములకు రూ.15 లక్షలు ఇస్తున్నామంటున్నారని, వాస్తవానికి మార్కెట్‌లో ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పలుకుతోందన్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలని సంబంధిత తహసీల్దారు, ఆర్డీవోలకు విన్నవించినా ఫలితంలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని