logo

‘ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం’

రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ ఆరోపించారు.

Published : 21 Mar 2023 04:07 IST

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ ఆరోపించారు. స్థానిక విలేకరులతో సోమవారం ఆమె మాట్లాడుతూ నిండు శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు గూండాల్లాగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. పార్టీ నాయకులు కిట్టన్న, రవికుమార్‌, ప్రభాకర్‌, చంద్రమోహన్‌రెడ్డి, మదార్‌సాబ్‌ పాల్గొన్నారు.

కలికిరి గ్రామీణ : అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో ఖండించారు.  ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, డోలా బాలవీరాంజనేయస్వామిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై ఎప్పుడు దాడి జరగలేదని గుర్తు చేశారు. జీవో నంబరు 1, అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు