logo

బాధిత రైతులను ఆదుకుంటాం

అకాల వర్షాలు, పెనుగాలులతో పూర్తిగా దెబ్బతిన్న తమలపాకు రైతులందరికీ ప్రభుత్వం నుంచి సాయమందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 04:07 IST

కలెక్టర్‌ విజయరామరాజు

వేంపల్లె, వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: అకాల వర్షాలు, పెనుగాలులతో పూర్తిగా దెబ్బతిన్న తమలపాకు రైతులందరికీ ప్రభుత్వం నుంచి సాయమందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. స్థానిక గండిరోడ్డులో పెనుగాలులకు నేలమట్టమైన తమలపాకు తోటలను సోమవారం జేసీ సాయికాంత్‌వర్మతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ సభ్యుడు కటికచంద్ర, పలువురు తమలపాకు రైతులు కలెక్టర్‌ను కలిసి 100 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని ఆదుకోవాలని కోరారు. అనంతరం వీరపునాయునిపల్లె మండలం తంగేడుపల్లెలో దెబ్బతిన్న అరటి పంటనూ పరిశీలించారు. వివరాలు సేకరించి పూర్తి స్థాయి నివేదికలు అందించాలని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు. పులివెందుల ఆర్డీవో వేంకటేశ్వర్లు, తహసీల్దారు చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యానవనశాఖాధికారి రెడ్డయ్య, ఏవో రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని