logo

ఆశా కార్యకర్తల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Published : 22 Mar 2023 01:36 IST

రాయచోటి, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రామాంజులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఈ నెల 24వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తల పనిభారం పెరుగుతున్నా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కార్యకర్తల అక్రమ తొలగింపులు, వేధింపులు ఆపాలని డిమాండు చేశారు. విధులు నిర్వహిస్తూ మృతిచెందితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, సచివాలయాల్లో విధులు కేటాయించరాదని, సెలవులు మంజూరు చేస్తూ కనీస వేతనం రూ.26 వేలివ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం జిల్లా కోశాధికారి ముంతాజ్‌, సభ్యులు రమాదేవి, సత్యవాణి, సంగీత, రోజా, హజరాబీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని