logo

ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడండి: తెదేపా

బద్వేలు రోడ్డు చిన్న మసీˆదు వద్ద ఎర్రచెరువు అలుగువంక పక్కన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండు చేశారు.

Updated : 22 Mar 2023 03:52 IST

మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

మైదుకూరు, న్యూస్‌టుడే : బద్వేలు రోడ్డు చిన్న మసీదు వద్ద ఎర్రచెరువు అలుగువంక పక్కన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండు చేశారు. వంక ఇనుప కంచెను ధ్వంసం చేసి కల్వర్టు నిర్మాణానికి ప్రయత్నించిన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా నాయకులు కొందరు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు వీలుగా నీటి యాజమాన్య సంస్థ అధికారుల అనుమతితో వంకపై కల్వర్టు నిర్మాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకోగా వారిని ఏమార్చి తాత్కాలిక కల్వర్టు నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. మహిళల మాటలను బేఖాతరు చేసి కల్వర్టు నిర్మాణం చేశారనే విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు మంగళవారం చిన్నమసీదు వద్దకు చేరుకుని పరిశీలించారు. పార్టీ నాయకుడు రఫి ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. స్థానిక మహిళలతో మాట్లాడారు. వంకపై దారి ఏర్పాటును వ్యతిరేకించిన మహిళలను దుర్భాషలాడిన వైకాపా నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. వంకపై ఏర్పాటు చేసిన తాత్కాలిక కల్వర్టును తొలగించి కంచెను పునరుద్ధరించాలన్నారు. అనంతరం తహసీల్దారు బి.అనూరాధకు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని