logo

మానవత్వం... జ్ఞానం కంటే గొప్పది

తల్లిదండ్రులు దేవుళ్లకంటే గొప్పవారు.. జ్ఞానం కంటే మానవత్వం గొప్పది. కృషితో నాస్తి దుర్బిక్షం తను ఎదగడమే కాదు ఇతరులు కూడా బాగుపడాలని సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కేపీసీ ఫౌండేషన్‌...

Published : 22 Mar 2023 01:48 IST

విద్యార్థినికి ఉపకార వేతనాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు, కలెక్టరు విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, కేపీసీ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు దేవుళ్లకంటే గొప్పవారు.. జ్ఞానం కంటే మానవత్వం గొప్పది. కృషితో నాస్తి దుర్బిక్షం తను ఎదగడమే కాదు ఇతరులు కూడా బాగుపడాలని సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న కేపీసీ ఫౌండేషన్‌ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ సూచించారు. మంగళవారం స్థానిక కొర్రపాడు రోడ్డులోని కేపీసీ వ్యవస్థాపకుడు దివంగత కేసీ పుల్లయ్య 11వ వర్ధంతి ఘనంగా జరిగింది. కేపీసీ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌, కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ అధ్యక్షతన సాగిన ఉపకారవేతనాలు, ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరైన ఎమ్మెల్యే, కలెక్టరు, జేసీ జ్యోతి వెలిగించారు. అనంతరం మానవ అక్రమ రవాణా ముఠాల చెర నుంచి 80 వేల మంది మహిళలను కాపాడి ప్రతిభ చాటిన మేఘాలయకు చెందిన హసీనా ఖర్బికి స్మారక సేవా రత్న, మగపిల్లాడిగా పుట్టి హిజ్రాగా మారి 350 మంది విద్యార్థులకు విద్య చెప్పిస్తున్న కుట్టి నమితాకు స్మారక విద్యా రత్న, భారత సైనికుడు శరీరం సచ్చుపడిపోయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా నోటితో కుంచె పట్టి చిత్ర, విచిత్రాలు గీసే కళాకారుడు భీమ్‌ కుమార్‌ కర్కికి స్మారక కళారత్న, కరెంటు వినియోగించకుండా రెండు గ్రామాలకు సోలారు విద్యుత్తు అందిస్తున్న అనంతపురానికి చెందిన కల్యాణ్‌ అక్కిపెద్దికి హరిత రత్న పురస్కారాలను అందజేశారు. అనంతరం బీటెక్‌ చవివిన విద్యార్థులకు రూ.5 వేలు, డిప్లొమా, ఇంటర్‌ వారికి రూ.2 వేలు, డిగ్రీ వారికి రూ.3 వేలు చొప్పున 500 మందికి ఉపకార వేతనాలు అందజేశారు. కేపీసీ యాజమాన్యం కేసీ పుల్లయ్య సతీమణి కృష్ణవేణి, లక్ష్మీ, శైలజ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని