logo

కరవు భత్యం బకాయిలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు వెంటనే డీఏ ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Published : 22 Mar 2023 01:57 IST

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు వెంటనే డీఏ ప్రకటించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కడప జడ్పీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఏపీటీఎఫ్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించలేదన్నారు. 2018 నుంచి రావాల్సిన కరవు భత్యం బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, నాలుగేళ్లు కావస్తున్నా కనీస చర్యల్లేవన్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించడం మినహా ప్రత్యామ్నాయ విధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలకు దరఖాస్తు చేస్తే నెలల తరబడి చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లించాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కౌన్సిలర్లు గుర్రయ్య, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని