logo

శ్రీవారి సేవలో ముస్లిం మైనార్టీలు

తిరుమల తొలి గడప దేవుని కడపలో ముస్లిం మైనార్టీలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ముస్లిం మహిళలు ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారు.

Published : 23 Mar 2023 04:49 IST

దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేస్తున్న ముస్లిం మహిళలు

మారుతీనగర్‌ (కడప), న్యూస్‌టుడే : తిరుమల తొలి గడప దేవుని కడపలో ముస్లిం మైనార్టీలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ముస్లిం మహిళలు ఆలయానికి చేరుకుని స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆడబిడ్డ సారెను అందించారు. బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు అని, తాతల కాలం నుంచి ఉగాది రోజున స్వామి, అమ్మవారికి పూజలు చేస్తామని, ఆడపడుచు లాంచనంగా బియ్యం, కందిపప్పు, బెల్లం, సారె ఇచ్చి మొదటి పూజలు చేస్తామన్నారు. అనంతరం అర్చకులు ఆలయంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని