logo

వేతనాలందక వెతలు!

జిల్లాలోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సబ్‌డివిజన్‌ కేంద్రాల్లోని ల్యాబ్‌అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 23 Mar 2023 06:17 IST

ఆరు నెలలుగా నీటి పరీక్ష కేంద్రాల ఉద్యోగుల ఎదురుచూపులు
- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

రాజంపేటలోని నీటి పరీక్ష కేంద్రం

జిల్లాలోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సబ్‌డివిజన్‌ కేంద్రాల్లోని ల్యాబ్‌అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు జీతాలు చెల్లించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదని వారంతా వాపోతున్నారు. మరోపక్క  రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ సబ్‌ డివిజన్‌ కేంద్రాల్లోని నీటి పరీక్ష కేంద్రాల్లో 60 మంది పనిచేస్తున్నారు. వీరందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి నెలా తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయంలో ఎలాంటి లోపాలున్నా అధికారులకు తెలిపి వాటికి పరిష్కారాలు తెలపడం వారి పని. ప్రతి ల్యాబ్‌లో ఆరుగురు పనిచేస్తున్నారు. వీరికి వివిధ స్థాయిలు బట్టి రూ.15 వేల నుంచి రూ.21,500 వరకు వేతనాలిస్తుండగా, గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ రాజాంపేట డీఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వాస్తవమేనన్నారు. బడ్జెట్‌ లేని కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు