logo

సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ముందుండాలి

సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధన, స్పందన అర్జీల సత్వర పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ముందుండాలని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌ పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 04:51 IST

రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌

మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌,  వేదికపై వైయస్‌ఆర్‌, అన్నమయ్య కలెక్టర్లు విజయరామరాజు, గిరీష, ఎస్పీ అన్బురాజన్‌ తదితరులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధన, స్పందన అర్జీల సత్వర పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ముందుండాలని రాష్ట్ర ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్‌ పేర్కొన్నారు. కడప కలెక్టరేట్‌లో శనివారం ఆయన వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్లు విజయరామరాజు, గిరీష, ఎస్పీ అన్బురాజన్‌, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిలీనియం సమీకృత అభివృద్ధికి, లక్ష్యాల సాధనకు ప్రపంచ వ్యాప్తంగా 8 అంశాలు, 18 లక్ష్యాలు, 56 సూచికలతో ప్రణాళికలు రూపొందించామన్నారు. సమష్టి కృషి ద్వారా పరస్పరం చర్చించుకోవడమే ప్రధాన ఉద్దేశమన్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సచివాలయాల్లో స్పందన అర్జీలు స్వీకరిస్తూ నాణ్యతతో కూడిన పరిష్కారం, సంతృప్తికరమైన ఫీడ్‌బ్యాక్‌లో ముందున్నామన్నారు. అనంతరం కలెక్టర్లు విజయ రామరాజు, గిరీష పలు సూచనలిచ్చారు. వివిధ శాఖల ప్రతినిధులు పీపీటీలో అవగాహన కల్పించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్‌, సీపీవో వెంకట్రావు, రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని