logo

రామయ్య క్షేత్రంలో భక్తులపై తేనెటీగల దాడి

ఒంటిమిట్ట కోదండరామాలయం దర్శనం కోసం వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. రామయ్య క్షేత్రంలో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ల పనులు జరుగుతుండగా ఇనుప పైపులు కింద పడ్డాయి.

Published : 26 Mar 2023 04:51 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే : ఒంటిమిట్ట కోదండరామాలయం దర్శనం కోసం వచ్చిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. రామయ్య క్షేత్రంలో శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ల పనులు జరుగుతుండగా ఇనుప పైపులు కింద పడ్డాయి. కోతులను బెదరగొట్టడానికి బాణసంచా కాల్చారు. ఆ శబ్దాలకు తూర్పు ద్వారం గోపురం పైన ఉన్న తుట్టె నుంచి తేనెటీగలు లేచాయి. భక్తులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు చేస్తున్న కార్మికులు, మాడ వీధుల్లో చిరువ్యాపారులపై దాడిచేశాయి. గాయపడినవారికి స్థానిక వైద్యశాలలో చికిత్స చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు