logo

చీర కొంగే యమపాశం

ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ చీర కొంగే ఆమె పాలిట యమపాశమైంది. ఎదురుగా వస్తున్న లారీకి ఆమె చీర కొంగు తగలడంతో కొంత దూరం లాక్కెళ్లడంతో కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు

Published : 26 Mar 2023 04:51 IST

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

సుబ్బమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

బద్వేలు, న్యూస్‌టుడే: ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ చీర కొంగే ఆమె పాలిట యమపాశమైంది. ఎదురుగా వస్తున్న లారీకి ఆమె చీర కొంగు తగలడంతో కొంత దూరం లాక్కెళ్లడంతో కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన బద్వేలు మండలం తొట్టిగారిపల్లె వద్ద 67వ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగింది. బద్వేలు కుమ్మరి కొట్టాలలో తమ సమీప బంధువు మృతి చెందడంతో ప్రొద్దుటూరు మోడెంపల్లెకు చెందిన తుపాకుల సుబ్బమ్మ (53) తన కుటుంబ సభ్యులతో కలిసి చివరి చూపు చూసేందుకు శనివారం ఆటోలో వెళ్లారు. కార్యక్రమ అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. తొట్టిగారిపల్లె పెట్రోలు బంకు వద్దకు రాగానే ఆటోలో కూర్చున్న సుబ్బమ్మ చీర కొంగును ఎదురుగా వస్తున్న ఓ లారీ తగలడంతో కొంత దూరం లాక్కెళ్లడంతో కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆమెతో పాటు ఆటో చోదకుడు పక్కన కూర్చుని ఉన్న మరో ప్రయాణికుడు షేక్‌ షబ్బీర్‌ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ఉన్న మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. బద్వేలు సీఐ వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సై వెంకటరమణ ప్రమాద స్థలిని పరిశీలించారు. మహారాష్ట్రకు చెందిన లారీతో పాటు చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు