logo

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 40 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను  ఖాజీపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

Published : 26 Mar 2023 05:02 IST

రూ.10.25 లక్షలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌, పక్కన మైదుకూరు సీఐ నరేంద్రరెడ్డి, ఎస్సై కుళ్లాయప్ప, తదితరులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 40 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను  ఖాజీపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘దువ్వూరు మండలం, జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి మహమ్మద్‌రఫి, ప్రొద్దుటూరు మండలం వాజుపేయీనగర్‌కు చెందిన మల్లె భరత్‌కుమార్‌ గత 20 ఏళ్ల నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరిలో తిమ్మారెడ్డి మహమ్మద్‌రఫిపై 38 కేసులు, మల్లె భరత్‌కుమార్‌పై రెండు కేసులున్నాయి. ఖాజీపేట, దువ్వూరు, కలసపాడు, మైదుకూరు, నందలూరు, నందిగామ ప్రాంతాల్లో ఎనిమిది చోరీలు చేశారు. ప్రొద్దుటూరు నుంచి కారులో కడప వైపు వస్తుండగా ఖాజీపేట పోలీసులు భూమాయపల్లె వద్ద అరెస్టు చేశారు. వివచారణలో చోరీలు చేసినట్లు అంగీకరించారు. నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.10.25 లక్షలు విలువ చేసే బంగారు నగలు, రూ.5 వేల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన ఖాజీపేట, మైదుకూరు పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో సీఐ నరేంద్రరెడ్డి, ఎస్సై కుళ్లాయప్ప పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు