logo

పులివెందులలో కారు దగ్ధం

పట్టణంలోని ఉలిమెల్ల రోడ్డులో శనివారం షార్ట్‌సర్క్యూట్తో ఓ కారు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు.

Published : 26 Mar 2023 05:02 IST

పులివెందుల, న్యూస్‌టుడే : పట్టణంలోని ఉలిమెల్ల రోడ్డులో శనివారం షార్ట్‌సర్క్యూట్తో ఓ కారు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన మనోహరరెడ్డి కారులో డ్రైవర్‌ రాజు అల్పాహారం తీసుకొస్తుండగా కారు కింది భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చోదకుడు రాజుకు స్థానికులు చెప్పడంతో అతడు కారులో నుంచి కిందికి దిగి మంటలను అదుపుచేసేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకునేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హుసేన్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు