అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ సైబర్‌క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.
సైబర్‌క్రైం ఎస్‌ఐకి వినతిపత్రం అందిస్తున్న తెదేపా నేతలు
అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరికృష్ణ సైబర్‌క్రైం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వైకాపాకు చెందిన కొంతమంది తెదేపా అగ్రనాయకత్వంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్నారు. రంజాన్‌మాసంలో హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా మతాల మధ్య చిచ్చురేపేలా పోస్టులున్న నేపథ్యంలో వాటిని రూపొందించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, ఖాజా, భరత్‌కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!