logo

బాలుడిని బలితీసుకున్న ఈత సరదా

ఈత సరదా తెచ్చిన అనర్థం ఓ బాలుడిని బలితీసుకున్న ఘటన మదనపల్లె రూరల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..

Published : 27 Mar 2023 05:53 IST

మృతి చెందిన పండు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : ఈత సరదా తెచ్చిన అనర్థం ఓ బాలుడిని బలితీసుకున్న ఘటన మదనపల్లె రూరల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణంలోని జుడీషియల్‌ కాలనీ ఫస్ట్‌క్రాస్‌కు చెందిన మహేష్‌, రెడ్డిరాణిల కుమారుడు పండు (13) మదనపల్లెలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన ఆరుగురు స్నేహితులతో కలసి మదనపల్లె రూరల్‌ కోళ్లబైలు పంచాయతీ మామిడిగుంపులపల్లె సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత సక్రమంగా రాకున్నప్పటికి లోతట్టు ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు కేకలేయడంతో స్థానికులు వచ్చి వెతికారు. అయితే బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మదనపల్లె అగ్నిమాపక అధికారి మాబూసుభాన్‌ ఆధ్వర్యంలో సిబ్బంది పురుషోత్తం నాయుడు మురళీమోహన్‌నాయక్‌, ఇమ్రాన్‌, విజయ్‌కుమార్‌, ప్రకాష్‌ల బృందం అక్కడికి చేరుకుని పాతాలభైరవి సాయంతో మృతదేహం కోసం గాలించారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో సుమారు గంట పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ముగ్గురు ఆడ పిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడే అంటూ రోధించారు. ‘పండూ.. లే నాయనా..’ అంటూ రోధించడం అందర్ని కలచివేసింది. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి పోయారు. ఈ సంఘటనపై రూరల్‌ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు