logo

ఆధార్‌ వందశాతం అనుసంధానం చేయాలి

ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఓటరు ఆధార్‌ సంఖ్యను సేకరించి వందశాతం అనుసంధానం పూర్తి చేయాలని పీలేరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ గోపాలకృష్ణ అన్నారు.

Published : 27 Mar 2023 05:53 IST

సిబ్బందికి సూచనలిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ గోపాలకృష్ణ

పీలేరు, న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో ఉన్న ప్రతి ఓటరు ఆధార్‌ సంఖ్యను సేకరించి వందశాతం అనుసంధానం పూర్తి చేయాలని పీలేరు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం పీలేరు పట్టణంలో జరుగుతున్న ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని తహసీల్దార్‌ రవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను తప్పకుండా పాటించాలని ఇందులో ఎలాంటి జాప్యం ఉండరాదని చెప్పారు. కలెక్టర్‌ గిరీష నిర్వహిస్తున్న సమావేశంలో కూడా దీనిపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది తాస్కారం లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి ఆధార్‌ సేకరించాలని సూచించారు. పీలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 82 శాతం ఆధార్‌ అనుసంధానం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవి, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌, ఆర్‌ఐ రాజశేఖర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని