logo

వందే భారత్‌ మనకెప్పుడు?

దక్షణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్‌, నాంధేడ్‌, సికింద్రాబాద్‌, విజయవాడ రైల్వే డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌ డివిజన్‌ తర్వాత రైల్వేకి గుంతకల్లు డివిజన్‌ నుంచే అధిక ఆదాయం సమకూరుతోంది.

Updated : 27 Mar 2023 06:38 IST

ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి నడపాలని డిమాండు

వందేభారత్‌ రైలు

న్యూస్‌టుడే, కడప ఏడురోడ్లు: దక్షణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్‌, నాంధేడ్‌, సికింద్రాబాద్‌, విజయవాడ రైల్వే డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్‌ డివిజన్‌ తర్వాత రైల్వేకి గుంతకల్లు డివిజన్‌ నుంచే అధిక ఆదాయం సమకూరుతోంది. రైల్వే సేవలు, ప్రాజెక్టుల పరంగా చూస్తే ఆశించిన మేరకు ఉండడం లేదు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దేశవ్యాప్తంగా పలుచోట్ల నడుపుతున్నారు. గుంతకల్లు డివిజన్‌ పరిధిలో కడప మీదుగా తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై, కర్నూలుకు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు 8 నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు ఒకటి నడుస్తోంది. రాబోయే రెండేళ్లలో 300 పైగా వందేభారత్‌ రైళ్లను దేశవ్యాప్తంగా పట్టాలెక్కాలేక్కించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఈ ఏడాది ఆగస్టుకు 75 అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం రేణిగుంట- హైదరాబాద్‌ రైల్వే ట్రాక్‌పై 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడుస్తున్నాయి. వందేభారత్‌ రైళ్లు 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయి. రైల్వే లైన్లకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

* రాయలసీమ నుంచి హైదరాబాద్‌, చెన్నై, విజయవాడకు వందేభారత్‌ రైళ్లు నడపాలనేది ప్రజల ఆకాంక్ష. హైదరాబాద్‌- తిరుపతి, చెన్నై-కర్నూలు, తిరుపతి-విజయవాడ, కడప మీదుగా ఈ రైళ్లు నడిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో ఈ ప్రాంతానికి నిత్యం వేలమంది భక్తులు వస్తుంటారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం, సమీపంలోనే కోటప్పకొండ ఉంది. ఇక్కడ కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఎక్కువ. విజయవాడ- తిరుపతికి నంద్యాల, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట మీదుగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపాలని కోరుతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గంలో బస్సులతో పాటు రైళ్లు, విమానాలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఉదయం వేళల్లో హైదరాబాద్‌కు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని