logo

వాల్మీకి క్షేత్రం... అంతా రామమయం

తితిదే ఆధ్వర్యంలో శ్రీపట్టాభి రామాలయంలో ఆదివారం రాత్రి అంకురార్పణతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Published : 27 Mar 2023 06:05 IST

ఘనంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అంకురార్పణ నిర్వహిస్తున్న వేదపండితులు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : తితిదే ఆధ్వర్యంలో శ్రీపట్టాభి రామాలయంలో ఆదివారం రాత్రి అంకురార్పణతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 6 గంటలకు మూలవర్లకు అభిషేకం, 7 గంటలకు అలంకరణ, తదుపరి తోమాలసేవ, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో రాత్రి ఏడు గంటలకు స్వస్తి పుణ్యహవచనం, మృత్సం గ్రహణం, రక్షా బంధనం, సేనాధిపతి ఉత్సవం, కలశస్థాపన తదితర కార్యక్రమాల అనంతరం తితిదే వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాల ప్రారంభానికి సూచికగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేసిన రంగురంగుల విద్యుత్తు దీపాలంకరణ, విదేశీ పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో తితిదే అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, తితిదే వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని