logo

జిల్లా యూనిట్‌గా ప్రతిపాదించడం సరికాదు

ప్రభుత్వం ప్రతిపాదించిన మున్సిపల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ యూనిఫైడ్‌ డ్రాఫ్ట్‌రూల్స్‌లోని లోపాలను సవరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ కమిటీ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 27 Mar 2023 06:13 IST

మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర మున్సిపల్‌ కమిటీ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి

కడప విద్య, న్యూస్‌టుడే : ప్రభుత్వం ప్రతిపాదించిన మున్సిపల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ యూనిఫైడ్‌ డ్రాఫ్ట్‌రూల్స్‌లోని లోపాలను సవరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ కమిటీ కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ యూనిఫైడ్‌ డ్రాఫ్ట్‌ రూల్స్‌పై కడప నగరంలోని వీవీఆర్‌ ఎస్టీయూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు జిల్లాలోని కార్పొరేషన్‌ను ఒక యూనిట్‌గా, మున్సిపాలిటీని ఒక యూనిట్‌గా పరిగణించాలన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పట్టణాల్లో స్థిరపడిన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసేలా జిల్లా యూనిట్‌గా ప్రతిపాదించడం సరికాదన్నారు. డ్రాఫ్ట్‌రూల్స్‌లో మున్సిపల్‌ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల విషయంపై స్పష్టమైన విధానాన్ని పేర్కొనలేదని, దీన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. పురపాలకల్లో అర్బన్‌ ఎంఈవో పోస్టులను, అర్బన్‌ డీవైఈవో పోస్టులను మంజూరుచేసి అక్కడి ఉపాధ్యాయులతోనే భర్తీచేయాలని డిమాండు చేశారు. డ్రాఫ్ట్‌ అమలు, ఆమోదానికి ముందే బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎండీ ఇలియాస్‌బాషా మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయులకు 2010 నుంచి సీఎస్‌ఎస్‌లో జమైన పీఆర్సీ, డీఏ బకాయిలను సీపీఎస్‌ ఉద్యోగులకు నగదుగా చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ జీపీఎఫ్‌ ఖాతాలో జమచేయలేదన్నారు. డ్రాఫ్ట్‌ రూల్స్‌ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, నగరపాలక, మున్సిపల్‌ ఉపాధ్యాయుల పర్యవేక్షణ, పరిపాలనను యధాతథంగా కొనసాగించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి మహబూబ్‌బాషా, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పద్మాకర్‌, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాదక్‌అలీ, సంజీవరాయుడు, నాయకులు ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి, అనిల్‌కుమార్‌, సత్తార్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని