logo

మార్కెట్‌కు రంగనాథస్వామి పేరునే కొనసాగించాలని నిరసన

కూరగాయల మార్కెట్కు రంగనాథస్వామి పేరును తొలగించి వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం దుర్మార్గమని భాజపా కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు.

Published : 28 Mar 2023 03:14 IST

ర్యాలీగా వస్తున్న హిందూ ఐక్యవేదిక సభ్యులు, ప్రజలు

పులివెందుల, న్యూస్‌టుడే : కూరగాయల మార్కెట్కు రంగనాథస్వామి పేరును తొలగించి వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం దుర్మార్గమని భాజపా కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు. కూరగాయల మార్కెట్‌కు రంగనాథస్వామి పేరును కొనసాగించాలంటూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పులివెందులలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో మేనేజర్‌ సతీష్‌ కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. శశిభూషణ్‌రెడ్డి, తెదేపా నాయకుడు తూగుట్ల మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవుడి పేరును మార్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. చాలా చోట్ల వైయస్‌ఆర్‌ విగ్రహాలు ఏర్పాటు చేశారని, పలు వీధులకు ఆయన పేర్లు పెట్టారని, ఇప్పుడు దేవుడి పేరును తొలగించి వైయస్‌ఆర్‌ పేరు పెట్టడం ఏమిటన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రామిరెడ్డి,  నంద్యాల హేమాద్రిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, సుష్మ, శ్రీరాములు, మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని