logo

సినిమా రంగానికి పునాది నాటకం

సినిమా రంగానికి ఒకప్పటి నాటకరంగం పునాదని ప్రముఖ ఆడిటర్‌ లయన్‌ పి.ఖాసీంఖాన్‌ అన్నారు. సీపీ బ్రౌన్‌భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో శ్రీవేంకటేశ్వర సాంస్కృతిక కళామండలి ప్రధాన కార్యదర్శి మధుబాబు నిర్వహణలో సోమవారం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు.

Published : 28 Mar 2023 03:14 IST

మాట్లాడుతున్న శ్రీవేంకటేశ్వర సాంస్కృతిక కళామండలి ప్రధాన కార్యదర్శి మధుబాబు, పక్కన ప్రముఖులు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే : సినిమా రంగానికి ఒకప్పటి నాటకరంగం పునాదని ప్రముఖ ఆడిటర్‌ లయన్‌ పి.ఖాసీంఖాన్‌ అన్నారు. సీపీ బ్రౌన్‌భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో శ్రీవేంకటేశ్వర సాంస్కృతిక కళామండలి ప్రధాన కార్యదర్శి మధుబాబు నిర్వహణలో సోమవారం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. ముందుగా ధర్మవరం రామకృష్ణమాచార్యుల చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వాహకులు మధుబాబు కార్యక్రమ నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో వైవీయూ డీన్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ రామప్రసాద్‌రెడ్డి, లయన్‌ కె.చిన్నపరెడ్డి, బీసీ వెల్ఫేర్‌ అధికారి బ్రహ్మయ్య, ప్రముఖ నాటకకర్త పి.లక్ష్మీకులశేఖర్‌, కొండూరు జనార్దన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని