logo

పోలవరం ఎత్తు తగ్గిస్తే సీమ ఎడారే

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని, పూర్తిస్థాయిలో నీటిని నిలిపేలా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 03:14 IST

కలెక్టరేట్‌ ఎదుట దీక్షలు చేస్తున్న సీపీఐ నాయకులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని, పూర్తిస్థాయిలో నీటిని నిలిపేలా నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పోలవరం ప్రాజెక్టును 150 అడుగులతో నిర్మించాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. 150 అడుగుల ఎత్తులో 294 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రోజుకో షరతు విధిస్తూ నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీకి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం సామర్థ్యాన్ని 90 అడుగులకు కుదిస్తే రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి, ఆంజనేయులు, బషీరున్నీసా, సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, వేణుగోపాల్‌, బాదుల్లా, వలరాజు, గంగాసురేష్‌, సావంత్‌ సుధాకర్‌, మనోహర్‌రెడ్డి, ఈశ్వరయ్య, వెంకటరాముడు, యానదయ్య, పద్మ, మైనుద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని