logo

పాసు పుస్తకాలు మంజూరు చేయాలని ఆందోళన

పది నెలలుగా పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలంటూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లెకు చెందిన రైతు హరిబాబు, అతని తల్లి కనకమ్మ సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట పెట్రోలు సీసాలతో నిరసన వ్యక్తం చేశారు.

Updated : 28 Mar 2023 06:26 IST

పీటీఎం తహసీల్దారు కార్యాలయం వద్ద తల్లీకుమారుల నిరసన

పెట్రోలు సీసాలతో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న తల్లీకుమారులు

పెద్దతిప్పసముద్రం గ్రామీణ, న్యూస్‌టుడే: పది నెలలుగా పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలంటూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లెకు చెందిన రైతు హరిబాబు, అతని తల్లి కనకమ్మ సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట పెట్రోలు సీసాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. పది నెలలుగా సీఎం కార్యాలయంతో పాటు కలెక్టర్‌ కార్యాలయంలో పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవట్లేదని వాపోయారు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన రెండున్నర ఎకరాల వారసత్వ భూమిని ఆన్‌లైన్‌ చేసి పాసు పుస్తకాలు మంజూరు చేయాలని పలుమార్లు విన్నవిస్తున్నా పట్టించుకోవట్లేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ విషయంపై తహసీల్దారును వివరణ కోరగా రైతు హరిబాబుకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో రికార్డులు అందించలేదన్నారు. ఈసీ రికార్డులు, పట్టా తమకు అందజేస్తే జాయింట్ కలెక్టర్‌కు రికార్డులు సమర్పించి పాసుపుస్తకాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని