logo

జీవో 52 రద్దు చేయాలని డిమాండు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబరు 52ను రద్దు చేయాలని తెదేపా రాజంపేట పార్లమెంటరీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు నటరాజ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2023 03:14 IST

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న తెదేపా ఎస్టీ సెల్‌ నాయకులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబరు 52ను రద్దు చేయాలని తెదేపా రాజంపేట పార్లమెంటరీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు నటరాజ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యువకులతో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగానూ వెనుకబడి ఉన్నామని.. ఇతరులను ఎస్టీ జాబితాల్లో చేర్చితే ఇంకా అణిచివేతకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 52 నంబరు జీవోను రద్దు చేయాలని.. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో మురళికి అర్జీ సమర్పించారు. ఆ సంఘం నాయకులు ఆదిశేషునాయక్‌, నాగరాజనాయక్‌, మారుతీనాయక్‌, దినేశ్‌కుమార్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని