logo

‘పేదల భూముల నుంచి మట్టి తరలింపు దారుణం’

అనుమతి లేనిదే పేదలకు చెందిన పట్టా భూముల్లో గ్రావెల్‌ను ఎలా తరలిస్తారని పురపాలక మాజీ ఛైర్మన్‌ జి.ముజీబ్‌హుస్సేన్‌ నిలదీశారు.

Published : 28 Mar 2023 03:14 IST

బాధితులతో కలిసి మాట్లాడుతున్న మదనపల్లె పురపాలక సంఘం మాజీ ఛైర్మన్‌ ముజీబ్‌హుస్సేన్‌

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: అనుమతి లేనిదే పేదలకు చెందిన పట్టా భూముల్లో గ్రావెల్‌ను ఎలా తరలిస్తారని పురపాలక మాజీ ఛైర్మన్‌ జి.ముజీబ్‌హుస్సేన్‌ నిలదీశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు చూసుకుని అధికారులు చట్టాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలు తమకు జరిగిన అన్యాయాన్ని అడిగితే వారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముజీబ్‌హుస్సేన్‌ తన నివాసంలో బాధిత రైతులతో కలిసి సోమవారం విలేకర్లతో మాట్లాడారు.. తురకపల్లె గ్రామానికి చెందిన రైతు ఎస్‌.జైన్‌బీకి చెందిన 1.98 ఎకరాల పట్టా భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ తవ్వి తిరుపతి నాలుగు రోడ్ల నిర్మాణ పనులకు వినియోగించేందుకు తరలించారన్నారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా వారిపైనే కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయమై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు వచ్చిన ఉత్తర్వు ప్రతులను చూపించారు. పట్టా భూమిలో ఇష్టారీతిన గ్రావెల్‌ తవ్వి సాగుకు వీలు కాకుండా చేసినందున తగిన నష్ట పరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని