logo

స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించకుంటే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Published : 28 Mar 2023 03:14 IST

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ గిరీష, జేసీ తమీమ్‌ అన్సారియా

రాయచోటి, న్యూస్‌టుడే: స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించకుంటే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మొక్కుబడిగా కాకుండా బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. దరఖాస్తులు మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వారం స్పందన కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమస్యలు పరిష్కార నివేదికతో రావాలన్నారు. పీలేరుకు మండలం కావలిపల్లెకు చెందిన రామచంద్రనాయక్‌ తాను సర్వే నంబరు 413/బిలో 4.30 ఎకరాలు 1413(ఎ)లో 4.50 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని తన పేరిట ఆన్‌లైన్‌ చేయించి పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. రాయచోటి మండలం పెమ్మాడపల్లెకు చెందిన వెంకటయ్య తనకు కొత్త రేషన్‌ కార్డు మంజూరు చేయాలని కోరారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేసి సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ తమీమ్‌ అన్సారియా, డీఆర్వో సత్యనారాయణ, జిల్లా భూ విభాగం ఏడీ జయరాజ్‌, ఏవో బాలకృష్ణ, నాగభూషణం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని