logo

ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు

తాళ్లమాపురం, కల్లూరులో ప్రకృతి సేద్యంతో సాగు చేసిన పంట పొలాలను పాండిచ్చేరికి చెందిన అరబిందో ఫౌండేషన్‌ రైతులు మంగళవారం పరిశీలించారు.

Published : 29 Mar 2023 04:03 IST

కల్లూరులో వరి పంటను పరిశీలిస్తున్న పాండిచ్చేరి రైతులు

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తాళ్లమాపురం, కల్లూరులో ప్రకృతి సేద్యంతో సాగు చేసిన పంట పొలాలను పాండిచ్చేరికి చెందిన అరబిందో ఫౌండేషన్‌ రైతులు మంగళవారం పరిశీలించారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్‌ఏ), ప్రొద్దుటూరు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రసాయనిక మందులు, ఎరువులు లేకుండా ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన వరి పంటతో లాభసాటి దిగుబడి వస్తుందని నిర్వాహకులు వివరించారు. యాక్సెస్‌ అగ్రికల్చర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు నందిని, ధనీష కల్లూరులోని జీవ వనరుల కేంద్రాన్ని పరిశీలించారు. సీఎస్‌ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆదినారాయణ, పీఎఫ్‌పీసీఎల్‌ సీఈవో పవన్‌కుమార్‌, జీవ వనరుల ప్రతినిధి అభిషేక్‌, మునిలక్ష్మి, కిసాన్‌ మిత్ర జయన్న, సునీత, కల్లూరు మాజీ సర్పంచి వల్లూరు నాగేంద్రరెడ్డి, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని