logo

ఘనంగా ధ్వజస్తంభ మండల ఆరాధన మహోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఫిబ్రవరి 14, 15 , 16వ తేదీల్లో ఘనంగా నిర్వహించారు.

Published : 29 Mar 2023 04:03 IST

ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న వేంకటాద్రిస్వామి, శంకర్‌బాలాజీ

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఫిబ్రవరి 14, 15 , 16వ తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నేటికీ 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా మంగళవారం పూర్వపు మఠాధిపతులు, ధ్వజస్తంభ దాతలు, మఠం ఫిట్‌పర్సన్‌ శంకర్‌బాలాజీ, మేనేజర్‌ ఈశ్వరాచారి, మఠం ఆస్థాన సిద్ధాంతి ఇడమకంటి జనార్థనాశివాచార్య బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామివారి శిష్యులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని