logo

మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు : కలెక్టర్‌

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 29 Mar 2023 06:11 IST

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష, పక్కన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ తమీమ్‌ అన్సారియా

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని తనిఖీ కేంద్రాల వద్ద విస్తృతంగా సోదాలు చేపట్టాలన్నారు. ఎంఈవోలు, కళాశాలల ప్రిన్సిపల్స్‌తో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఎవరైనా మాదకద్రవ్యాలు తీసుకుని వస్తే వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. గ్రామాల్లో మాదకద్రవ్యాల వినియోగంపై వీఆర్‌ఏలు, వీఆర్వోలు సమాచారం అందించేవిధంగా ఆదేశాలివ్వాలని ఆర్డీవోలకు సూచించారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్‌ ప్రీ నంబరు 1908కి కాల్‌ చేయవచ్చునన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పవర్‌ పాయింట్‌ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో గసాలు, గంజాయి అక్రమ సాగుపై దృష్టి సారించాలన్నారు. 2021 నుంచి 2023, మార్చి వరకు జిల్లాలో 23 కేసులు నమోదు చేసి 150 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. మొత్తం 64 మంది నిందితులతో పాటు 24 మంది విక్రయదారులను గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో జేసీ తమీమ్‌అన్సారియా, డీఆర్వో సత్యనారాయణ, ఆర్డీవోలు రంగస్వామి, మురళీ, డీఎస్పీ శ్రీధర్‌, డీఎంహెచ్‌వో కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని