logo

పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉద్యమమే

జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య హెచ్చరించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు.

Published : 29 Mar 2023 04:17 IST

సీపీఐ నాయకులనుద్దేశించి ప్రసంగిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య హెచ్చరించారు. కడప కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన దీక్షలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత జాతీయ హోదా కల్గిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. పోలవరం పూర్తయితే గాలేరు- నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. పోలవరం సామర్థ్యాన్ని 90 అడుగులకు కుదిస్తే నీటి సామర్థ్యం తగ్గి బ్యారేజీగా మారుతుందని, తద్వారా రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన స్వప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోదీ వద్ద తాకట్టుపెట్టారన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్ర, నాయకులు కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి, ఆంజనేయులు, బషీరున్నీసా, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌, వేణుగోపాల్‌, బాదుల్లా, మునెయ్య, వలరాజు, గంగాసురేష్‌, దస్తగిరి, అంకుశం, భాగ్యలక్ష్మి, మైనుద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని