logo

యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి

యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలస్తుందని డీఏవో నాగేశ్వర్‌రావు, బీసీ సంక్షేమశాఖ ఈడీ బ్రహ్మయ్య పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 04:25 IST

గోడపత్రాలను విడుదల చేస్తున్న డీఏవో నాగేశ్వర్‌రావు, ఈడీ బ్రహ్మయ్య,
ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మణికంఠ, తదితరులు

వైవీయూ (కడప), న్యూస్‌టుడే : యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటే దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలస్తుందని డీఏవో నాగేశ్వర్‌రావు, బీసీ సంక్షేమశాఖ ఈడీ బ్రహ్మయ్య పేర్కొన్నారు. నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జీ-20పై జిల్లా స్థాయి నైబర్‌హుడ్‌ యూత్‌ పార్లమెంట్‌ సదస్సులో భాగంగా మంగళవారం నగరంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీ-20 సదస్సు, వై 20, యువత స్కిల్స్‌, లేబర్‌ వెల్ఫేర్‌, బేటి బచావో బేటి పడావో, సైన్స్‌, టెక్నాలజీలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలు వాటి అమలు, రాజకీయాల్లో యువత పాత్ర గురించి అవగాహన కల్పించారు. ఏపీసీ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ కె.మణికంఠ, కళాశాల ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, విష్ణుమోహన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు నీలవేణి, శ్రావణి, సుబ్బనరసయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని