logo

చమురు, సహజవాయువుల అన్వేషణకు ఓఎన్‌జీసీ సర్వే

జిల్లాలోని పెన్నా, కుందూ పరివాహక సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఓఎన్‌జీసీ (ఆయిల్‌, నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) కార్యాచరణ దిశగా సన్నద్ధమవుతోంది.

Published : 30 Mar 2023 04:25 IST

సర్వేలో సిస్మోగ్రాఫ్‌ నమోదుకు వినియోగించే ప్రత్యేక వాహనం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలోని పెన్నా, కుందూ పరివాహక సమీపంలోని చుట్టుపక్కల గ్రామాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోని ఓఎన్‌జీసీ (ఆయిల్‌, నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) కార్యాచరణ దిశగా సన్నద్ధమవుతోంది. దీనిపై ఆయా మండలాల వారీగా భూకంప సర్వేలకు సంబంధించిన గ్రామాల జాబితాలను ఇటీవల తహసీల్దార్లకు చెన్నె నుంచి వచ్చిన సాంకేతిక బృందం అంద జేసింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి సర్వే పూర్తవుతుందని తెలిపింది. జాబితాలోని పేర్కొన్న గ్రామాల్లో 30 నుంచి 35 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేసిన రంధ్రాల్లో ప్రాథమిక ఎక్స్‌ప్లోరేషన్‌ ప్రక్రియతో భూమిపై ఉంచిన కేబుల్స్‌, సెన్సార్ల ద్వారా సిస్మోగ్రాఫ్‌లో నమోదు చేయడానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనం వినియోగించనున్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం ప్రభుత్వ పశువైద్య కళాశాలకు వెళ్లే రోడ్డు పక్కన జియో ఫిజికల్‌ ఫీల్డ్‌ పార్టీ-04 (చెన్నె) పేరు మీదుగా తాత్కాలిక క్యాంపు ఆఫీసును ఏర్పాటు చేశారు. ఇక్కడ సాంకేతిక నిపుణుల బృందం, గుత్తేదారు సిబ్బంది ఉన్నారు..రాజుపాళెం, దువ్వూరు, జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాల పరిధిలో భూకంప సర్వే కోసం మొత్తం 51 గ్రామాలకు సంబంధిత జాబితాలను తహసీల్దారు కార్యాలయాలకు అంద జేశారు. ఈ విషయమై జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని అయిదు మండలాల్లో ఆయిల్‌, సహజ వాయుల నిక్షేపాలను గుర్తించ డానికి ఓన్‌జీసీ చేపడుతున్న సర్వే వివరాలను తహసీల్దార్లకు అందజేశామని, డ్రిల్లింగ్‌ పనులకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని