logo

భర్తను బెదిరించడానికే అదృశ్య నాటకం

కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆమె ఆచూకీ కనుగొని తల్లికి అప్పగించారు.

Published : 31 Mar 2023 01:38 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆమె ఆచూకీ కనుగొని తల్లికి అప్పగించారు. సీకే.దిన్నె మండలం చెర్లోపల్లె గ్రామానికి చెందిన జరినా, తన భర్త అక్బర్‌కు మధ్య మనస్పర్థలు ఉన్నాయి. భర్తను బెదిరించడానికి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఈనెల 27న కడప మోచంపేటలోని తన పుట్టింటికి వచ్చి, అక్కడ నుంచి అదృశ్యమైంది. జరినా తల్లి షేక్‌ ఖదిరున్నిసా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా చరవాణిని స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఆమె ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. చరవాణిని ఆన్‌ చేయగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె బెంగళూరులో బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సీఐ తన సిబ్బందితో వెళ్లి ఆమెను తీసుకొచ్చి గురువారం తల్లి ఖదిరున్నిసాకు అప్పగించారు. భర్తను బెదిరించడానికే తాను ఇంటి నుంచి వెళ్లినట్లు ఆమె పోలీసులకు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు