మహబూబ్‌బాషాకు శస్త్రచికిత్స
వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్ మస్తాన్‌బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది.
అయిదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ
చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: వైయస్‌ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్ మస్తాన్‌బాషాకు చిత్తూరులో బుధవారం రాత్రి శస్త్రచికిత్స ముగిసింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు భరత్‌కుమార్‌రెడ్డి శస్త్రచికిత్స చేసి అయిదు రాజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అతడి తొడ భాగంలో బుల్లెట్ పెల్లెట్స్ గుర్తించి తొలగించారు. మోచేయి పైభాగం, కింది భాగంలో దెబ్బతిన్న ఎముకలు సరిచేశారు. తొడ భాగంలో ఓ పెద్ద పెల్లెట్, చిన్న పెల్లెట్‌తో పాటు గన్‌పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ రెండు తొడ భాగంలోని సయాటిక్ నరం వెనుక భాగంలో ఉండటంతో వాటిని తీయడానికి సాహసించక వదిలిపెట్టారు. అవి అక్కడ ఉండి పోయినా ప్రమాదం లేదని, నరం వెనుక ఆనుకుని ఉన్నదాన్ని తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తూ నరం దెబ్బతింటే కొన్ని సమస్యలొచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యుడు తెలిపారు. దీంతో గన్‌పౌడర్‌ను మాత్రమే తొలగించి కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మరోవైపున అతడి ఆరోగ్యంపై పులివెందులలోని రాజకీయ నాయకులు, అక్కడి పోలీసు అధికారులు వాకబు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం