logo

బడిపాలు... నేల పాలు!

గర్భిణులు, బాలింతలతోపాటు పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. నెలవారీ సమీక్షలతో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఎన్ని జాగ్రత్తలు...

Published : 31 Mar 2023 01:47 IST

ర్భిణులు, బాలింతలతోపాటు పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. నెలవారీ సమీక్షలతో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. బాలబడి (అంగన్‌వాడీ కేంద్రం)లకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పాలు పక్కదారి పడుతున్నాయి. చాలా కేంద్రాల నుంచి పొట్లాలను తక్కువ ధరకు విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్ళలుండగా, మరికొందరు కేంద్రాలకు వచ్చేవారికి సకాలంలో పంపిణీ చేయడం లేదు. దీంతో పాల పొట్లాలు చెడిపోవడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులోని కెప్టెన్‌ వీధి చివర బహిరంగ ప్రదేశంలో పాలపాకెట్లను వృథాగా పడేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసువాలని పలువురు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, రాయచోటి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు