logo

ఎర్రమట్టి...దుమ్ము పట్టి!

కడప-రాజంపేట ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మించిన విభాగినిలో మొక్కల పెంపకానికి ఎర్రమట్టిని రహదారిపై వేసి వదిలేశారు. అది కాస్త రహదారంతా విస్తరించి వాహనాల రాకపోకల సమయంలో దారి కనిపించనంతగా దుమ్మురేగుతోంది.

Published : 31 Mar 2023 01:47 IST

డప-రాజంపేట ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మించిన విభాగినిలో మొక్కల పెంపకానికి ఎర్రమట్టిని రహదారిపై వేసి వదిలేశారు. అది కాస్త రహదారంతా విస్తరించి వాహనాల రాకపోకల సమయంలో దారి కనిపించనంతగా దుమ్మురేగుతోంది. సుమారు కిలోమీటరు మేర వాహనచోదకులు దుమ్ముతో అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వెళ్లివచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి ఎర్రమట్టిని తొలగించి దుమ్ము రేగకుండా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. 

ఈనాడు, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని