క్రీడలతో మానసికోల్లాసం : కలెక్టర్
క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో గురువారం కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జట్ల మధ్య క్రికెట్ పోటీలు ఆసక్తికంగా జరిగాయి.
బ్యాటింగ్ చేస్తున్న కలెక్టర్ గిరీష, ఫీల్డింగ్ చేస్తున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
రాయచోటి, న్యూస్‌టుడే: క్రీడలు మానసికోల్లాసాన్నిస్తాయని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో గురువారం కలెక్టర్ వర్సెస్ ఎస్పీ జట్ల మధ్య క్రికెట్ పోటీలు ఆసక్తికంగా జరిగాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్పీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 222 పరుగు చేసింది. అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కలెక్టర్ జట్టు 112 పరుగులకే ఆలౌటై 111 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తమ బ్యాటింగ్, బౌలింగ్‌తో కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆకట్టుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగులందరూ క్రికెట్ పోటీల్లో పాల్గొనడం అభినందించదగ్గ విషయమని ఎస్పీ అన్నారు. పోటీల్లో ఆర్డీవో రంగస్వామి, పోలీసు, రెవెన్యూ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్